వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం ప్రధాన తపాలా కార్యాలయంలో ఏటీఎం తరహాలో పార్సిల్ బుకింగ్ సేవలను త్వరలో ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నారు. యంత్రంలో వివరాలు నమోదు చేసి చెల్లింపులు పూర్తికాగానే, పక్కనే ఉన్న యంత్రం తలుపులు తెరుచుకుంటాయి.
అందులో పార్సిల్ ఉంచగానే తక్షణమే రసీదు వస్తుంది. ప్రస్తుతం యంత్రాల కూర్పు పూర్తయినా, పార్సిల్స్ ఉంచేందుకు అవసరమైన ప్రత్యేక అట్ట డబ్బాల కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలోనే సేవలు అందుబాటులోకి వస్తాయని పోస్ట్‌మాస్టర్ తెలిపారు.
Comments
Loading comments...

