వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలగిరిలో అనుమతులు లేకుండా ప్రభుత్వ, చెరువు శిఖం భూముల్లో అక్రమంగా మట్టిని తవ్వి తరలిస్తున్నారు. సెలవు రోజుల్లో, రాత్రివేళల్లో సాగుతున్న ఈ దందా వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది.
సర్వే నంబర్ 272లో జరుగుతున్న తవ్వకాల వల్ల పంట పొలాలకు వెళ్లే దారి దెబ్బతినడమే కాకుండా, ఏర్పడిన గుంతల వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
Comments
Loading comments...

