Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సమ్మె వేళ ATM ఛార్జీలు రద్దు

Follow Udayam on Google
Sai Nath Sep 25, 2026 5:33 PM జాతీయంవాణిజ్యం
సమ్మె వేళ ATM ఛార్జీలు రద్దు - Udayam
బ్యాంకు యూనియన్ల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వరంగ బ్యాంకులు ఏటీఎం లావాదేవీలపై ఛార్జీలను రద్దు చేశాయి. సెప్టెంబర్‌ 28 నుంచి 30 వరకు ఈ మినహాయింపు అమల్లో ఉంటుంది. నిర్ణీత పరిమితి దాటిన లావాదేవీలపైనా రుసుములు వసూలు చేయబోమని ఎస్‌బీఐ, యూనియన్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పీఎన్‌బీ తెలిపాయి. సమ్మెతో బ్యాంకు సేవలకు అంతరాయం కలగకుండా ఖాతాదారులకు ఈ వెసులుబాటు కల్పించినట్లు బ్యాంకులు పేర్కొన్నాయి.

Comments

G
Loading comments...