Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం: సీఐ

Follow Udayam on Google
B RAJESH Sep 13, 2026 5:33 PM విజయనగరంGeneral
దత్తిరాజేరు మండలం షికారుగంజి జంక్షన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని గజపతినగరం సీఐ సన్యాసి నాయుడు తెలిపారు. సర్కిల్ పరిధిలో స్టాపర్లు ఏర్పాటు చేసినప్పటికీ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన లారీ డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడపడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ఘటనతో మూడు కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...