Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అస్సాంలో రూ.8,970 కోట్ల హైవే ప్రాజెక్టు

Follow Udayam Digital on Google
భవేష్ కుమార్ Aug 06, 2026 5:43 PM ఆల్ ఇండియా జాతీయ
అస్సాంలో రూ.8,970 కోట్ల హైవే ప్రాజెక్టు - Udayam Digital
అస్సాంలో 135.87 కిలోమీటర్ల గువాహటి-తేజ్‌పూర్ నాలుగు లేన్ల కారిడార్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం రూ.8,970.20 కోట్ల వ్యయం అంచనా వేశారు. ఎన్‌హెచ్‌-15పై చేపట్టే ఈ ప్రాజెక్టుతో ప్రయాణ సమయం తగ్గి, రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయని కేంద్రం తెలిపింది. ఇందులో ఐదు బైపాస్‌లు, ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ, పలు వంతెనలు, అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు.

Comments

G
Loading comments...