Back to feed
అస్సాం అసెంబ్లీలో యూసీసీ బిల్లు
Rohit Singh May 25, 2026 11:27 AM అల్ ఇండియా 25 views2 days ago

అస్సాం అసెంబ్లీలో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వివాహం, విడాకులు, వారసత్వ విషయాల్లో అందరికీ ఒకే విధానాన్ని అమలు చేయడం మరియు బహుభార్యాత్వాన్ని నిషేధించడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. ఉత్తరాఖండ్, గుజరాత్ తర్వాత ఈ బిల్లును ప్రవేశపెట్టిన మూడో రాష్ట్రంగా అస్సాం నిలిచింది.
అయితే రాష్ట్రంలోని షెడ్యూల్డ్ తెగలకు (ST) ఈ చట్టం నుండి మినహాయింపు ఇచ్చారు. ఈ బిల్లు ప్రకారం వివాహ వయస్సు పురుషులకు 21 ఏళ్లు, మహిళలకు 18 ఏళ్లుగా నిర్ణయించడంతో పాటు, లివ్-ఇన్ రిలేషన్ల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేశారు.
Comments
Loading comments...


