వార్తలకు తిరిగి వెళ్లండి
జియమ్మవలస మండలం చిన్నతోలుమండగూడలోని ప్రాథమిక పాఠశాల భవనం నిర్మాణం అసంపూర్తిగా ఉండిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. భవనానికి కనీసం కిటికీలు, తలుపులు కూడా లేకపోవడంతో చిన్నారులకు ఇబ్బందులు తప్పడం లేదు.
గుత్తేదారుకు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతోనే నిర్మాణ పనులు నిలిచిపోయాయని గ్రామస్థులు తెలిపారు. అధికారులు స్పందించి పాఠశాల భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

