Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆకలిగా ఉందని అన్నం అడిగాడు.. గొలుసు లాక్కెళ్లాడు!

Follow Udayam on Google
SHRUTHI Aug 28, 2026 7:29 PM నెల్లూరుGeneral
ఆకలిగా ఉందని అన్నం అడిగాడు.. గొలుసు లాక్కెళ్లాడు! - Udayam
నెల్లూరు జిల్లా కావలిలో ఆకలిగా ఉందంటూ అన్నం అడిగిన ఓ వ్యక్తి మహిళ మెడలోని మూడున్నర సవర్ల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. ఉత్తర జనతాపేటలో వస్త్ర దుకాణం నిర్వహిస్తున్న కంచర్ల సంపూర్ణమ్మ వద్దకు వచ్చిన దుండగుడు ఈ చోరీకి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...