వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ అశోక్నగర్లో బుధవారం రాత్రి సుభాష్ (40) అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు సుత్తితో కొట్టి హత్య చేశారు. నారాయణగూడ బ్రిడ్జి సమీపంలో కిరాణా దుకాణం పక్కన నిద్రిస్తున్న అతడిపై దాడి చేశారు.
తల, ముఖంపై తీవ్ర గాయాలతో సుభాష్ అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. హత్యకు కారణాలు, నిందితుల వివరాల కోసం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

