Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పామూరులో పాస్టర్లకు నిత్యావసర సరుకుల పంపిణీ

Follow Udayam on Google
మానస శర్మ Aug 11, 2026 5:57 PM మార్కాపురంఆంధ్రప్రదేశ్
పామూరులో పాస్టర్లకు నిత్యావసర సరుకుల పంపిణీ - Udayam
మార్కాపురం జిల్లా పామూరు మండలం తిరగలదిన్నె గ్రామంలోని గ్లోరీ ప్రార్థనా మందిరంలో శనివారం పాస్టర్ల ప్రత్యేక ప్రార్థనా కూడిక నిర్వహించారు. ఎడ్నమ్మ మెమోరియల్ క్రిస్టియన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాస్టర్లకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పాస్టర్ జోసఫ్‌ దేవుని వాక్య సందేశం అందించారు. కార్యక్రమంలో పామూరు పాస్టర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, పలువురు పాస్టర్లు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...