Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో డీసీపీ కుమార్తె మృతి

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 10, 2026 4:14 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
రోడ్డు ప్రమాదంలో డీసీపీ కుమార్తె మృతి - Udayam
విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె ఆసిఫా (24) రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ఆసిఫా మృతి చాలా బాధాకరమని, ఎంతో భవిష్యత్ ఉన్న యువతి మృతి చెందడం కలచివేసిందని పేర్కొన్నారు. షరీన్ బేగం కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం, ఆసిఫా ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...