Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

50 ఓటీటీలపై కేంద్రం నిషేధం

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 25, 2026 4:04 PM జాతీయంGeneral
50 ఓటీటీలపై కేంద్రం నిషేధం - Udayam
అసభ్యకర కంటెంట్‌ను ప్రసారం చేస్తూ దేశ చట్టాలను ఉల్లంఘిస్తున్న 50 ఓటీటీ యాప్స్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించినట్లు కేంద్ర మంత్రి ఎల్.మురుగన్ లోక్‌సభలో వెల్లడించారు. ఐటీ నిబంధనలు 2021తో పాటు మహిళలను అసభ్యకరంగా చూపడాన్ని నిషేధించే చట్టాల ప్రకారం ఈ చర్యలు తీసుకున్నామని, ఆయా యాప్‌ల వివరాలను గోప్యంగా ఉంచుతూ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను బ్లాక్ చేయాలని ఆదేశించామని తెలిపారు.

Comments

G
Loading comments...