వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాస్ అల్ ఖైమాలో శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు యూఏఈలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 400 మంది తెలంగాణ ప్రవాసులు కుటుంబ సమేతంగా హాజరయ్యారు.
అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బోనాలు సమర్పించారు. ఒగ్గుడోలు మోతలు, పోతురాజుల విన్యాసాలు, జానపద వాయిద్యాలతో ఎడారి నేలపై తెలంగాణ పల్లె వాతావరణం ఆవిష్కృతమైంది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ఈటీసీఏ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

