Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి జిల్లాలో ఏపీ టెట్‌కు ఏర్పాట్లు పూర్తి

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 04, 2026 12:13 PM తిరుపతిGeneral
తిరుపతి జిల్లాలో ఏపీ టెట్‌కు ఏర్పాట్లు పూర్తి - Udayam
ఆగస్టు 5 నుంచి 21 వరకు జరిగే ఏపీ టెట్–2026 పరీక్షలకు తిరుపతి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని డీఈవో కేవీఎన్ కుమార్ తెలిపారు. జిల్లాలోని 5 కంప్యూటర్ ఆధారిత కేంద్రాల్లో 11,391 మంది పరీక్షలు రాయనున్నారు. దివ్యాంగ అభ్యర్థుల కోసం 40 మంది స్క్రైబ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అభ్యర్థులు రెండు గంటల ముందే కేంద్రాలకు చేరుకుని హాల్‌టికెట్, ఫొటో గుర్తింపు కార్డు తీసుకురావాలని సూచించారు.

Comments

G
Loading comments...