వార్తలకు తిరిగి వెళ్లండి

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అరకు నియోజకవర్గంలోని అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శెట్టి గంగాధర్ స్వామి తెలిపారు. బుధవారం అరకులోయలో ఆయన మాట్లాడారు.
గిరిజన హక్కులు, ఐదో షెడ్యూల్, పీసా, 1/70 చట్టాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

