Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్బన్ రైతులకు ఎరువులు అందించాలి

Follow Udayam on Google
RR REDDY Aug 20, 2026 11:23 PM నిజామాబాద్General
అర్బన్ రైతులకు ఎరువులు అందించాలి - Udayam
ఆర్మూర్: అర్బన్ ప్రాంతాల్లో ఎరువుల కొరతను వెంటనే పరిష్కరించాలని ఆరు పంథాల రైతు సంఘాల ప్రతినిధులు సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియాకు వినతిపత్రం అందజేశారు. యూరియా, డీఏపీ, బీఎస్‌ఎస్‌ ఎరువులను సొసైటీల ద్వారా రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. గతంలో ఎదురైన ఇబ్బందులు పునరావృతం కాకుండా సకాలంలో ఎరువులు అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కలిగోట గంగాధర్‌తో పాటు రైతు ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...