Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అప్రకటిత విద్యుత్ కోతలతో ఇబ్బందులు

Follow Udayam on Google
p.g.murthy Aug 04, 2026 9:27 AM మంచిర్యాలGeneral
అప్రకటిత విద్యుత్ కోతలతో ఇబ్బందులు - Udayam
జన్నారం మండల కేంద్రంలో అప్రకటిత విద్యుత్ కోతలతో వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ విషయంలో అధికారులు ఎటువంటి సమాచారం అందించడం లేదని ప్రజలు వాపోతున్నారు. మంగళవారం ఉదయం ఐదు గంటల నుండి 8 గంటల మధ్య ఏడు సార్లు కరెంటు తీసివేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నీటి పథకాలు పనిచేయక ప్రజలకు నీటి సరఫరా నిలిచిపోయింది.పట్టణంలో విద్యుత్ కోతలు లేకుండా చూడాలని అధికారులను వారు కోరారు.

Comments

G
Loading comments...