Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అప్పులు తీర్చలేక ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

Follow Udayam on Google
p.g.murthy Jul 27, 2026 6:49 PM మంచిర్యాలక్రైమ్
అప్పులు తీర్చలేక ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య - Udayam
లక్షెట్టిపేట మండలంలోని కొత్తూరులో గుండారపు మహేష్ అప్పులు తీర్చలేక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై సురేష్ తెలిపారు. మహేష్ డ్రైవర్ గా పనిచేస్తూ ఫైనాన్సులో వ్యాన్ కొనుగోలు చేశాడు. వ్యాన్ ఈఎంఐ కట్టేందుకు కొంతమంది దగ్గర అప్పులు చేశాడు. ఇటీవల వ్యాన్ ను కుదవపెట్టి కొంతమంది దగ్గర అప్పు చేశాడన్నారు. వ్యాన్ లేకపోవడం, తీసుకున్న అప్పు కట్టాలని అప్పులిచ్చినవారు అనడంతో సోమవారం ఇంట్లో ఉరి వేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.

Comments

G
Loading comments...