వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుకొండలో నీటి ఎద్దడి నివారణకు పది బోర్లు వేయడానికి అత్యవసర కౌన్సిల్ సమావేశంలో గురువారం ఆమోదం తెలిపారు. మున్సిపల్ ఛైర్మన్ ఉమర్ ఫరూక్ ఖాన్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
దర్గాపేట, బీటీఆర్ కాలనీ, శ్రీరాములయ్య కాలనీల్లో తీవ్ర నీటి ఎద్దడి ఉన్నట్లు మంత్రి సవిత, మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో బోర్ల నిర్మాణానికి ఆమోదం తెలిపారు.
Comments
Loading comments...

