వార్తలకు తిరిగి వెళ్లండి

కలిగిరి ఏపీ మోడల్ స్కూల్‌లో 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు గణితం బోధించేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఏ. శ్రీను తెలిపారు. ఎంఎస్సీ మ్యాథమెటిక్స్, బీఈడీ అర్హత ఉండాలని పేర్కొన్నారు.
రోజుకు నాలుగు పీరియడ్లు బోధించాల్సి ఉంటుందని, జనవరి 2027 వరకు కాలపరిమితి ఉంటుందని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 27, 28 తేదీల్లో పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

