వార్తలకు తిరిగి వెళ్లండి

పాశర్లపూడి ఏటిగట్టు దిగువన అప్పనపల్లి డైవర్షన్ రోడ్డు సోమవారం వరద ముంపునకు గురైంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు రావడంతో రోడ్డుపై మూడు అడుగులకు పైగా నీరు ప్రవహిస్తోంది.
దీంతో అప్పనపల్లి, బి.దొడ్డవరం, పెదపట్నంలంక గ్రామాలకు వెళ్లే వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటిలోనే రాకపోకలు సాగించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

