వార్తలకు తిరిగి వెళ్లండి

చీపురుపల్లి మండలం పెదనడిపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన ఎం. దివ్య చరిత జాతీయ స్థాయి టెన్నికాయిట్ పోటీలకు ఎంపికైంది. ప్రకాశం జిల్లా జరుగుమల్లిలో జరిగిన 38వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ పోటీల్లో ఆమె ప్రతిభ కనబరిచి రజత పతకం సాధించింది.
ఈ విజయంతో అక్టోబర్ 17 నుండి పంజాబ్‌లో జరిగే జాతీయ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరపున ఆడే అవకాశాన్ని ఈ విద్యార్థిని దక్కించుకుంది. జాతీయ స్థాయిలోనూ రాణించి రాష్ట్రానికి పేరు తేవాలని పాఠశాల సిబ్బంది, స్థానికులు ఆమెను అభినందించారు.
Comments
Loading comments...

