Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనుమతులు ఇచ్చి రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి

Follow Udayam on Google
p.g.murthy Sep 16, 2026 3:32 PM మంచిర్యాలGeneral
అనుమతులు ఇచ్చి రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి - Udayam
జన్నారం మండలంలోని పుట్టిగూడా గ్రామానికి అటవీ శాఖ అనుమతులు ఇవ్వకపోవడంతో రోడ్డు నిర్మాణం నిలిచిపోయింది. వాస్తవానికి ఎమ్మెల్యే ఆ గ్రామానికి రోడ్డును మంజూరు చేశారు. అయితే అనుమతులు లేకపోవడంతో రోడ్డు నిర్మాణం పూర్తిగా నిలిచిపోయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కచ్చా రోడ్డు బురద మయంగా మారడంతో వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం అనుమతులు ఇప్పించి పూర్తి చేయాలని స్థానికులు కోరారు.

Comments

G
Loading comments...