Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నవరం కొండపై మద్యం తాగి యువకులు హల్‌చల్

Follow Udayam on Google
Sathish Aug 27, 2026 7:48 PM కాకినాడGeneral
అన్నవరం కొండపై మద్యం తాగి యువకులు హల్‌చల్ - Udayam
పవిత్ర పుణ్యక్షేత్రం అయిన అన్నవరం కొండపై మందుబాబులు గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో వీరంగం సృష్టించారు. ఉచిత కళ్యాణ మండపాల వద్ద ఎదురుగా వస్తున్న కారు డ్రైవర్‌తో వీరు వివాదానికి దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మద్యం తాగిన వారిని టోల్‌గేట్ దాటించి పైకి ఎలా అనుమతించారని భక్తులు విస్మయం వ్యక్తం చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...