వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి (తిరుపతి జోన్) సీనియర్ ఇంజనీర్ యుగంధర్ మునిప్రసాద్ ఏసీబీకి చిక్కారు. కర్నూలు, తిరుపతి, హైదరాబాద్‌లలోని ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు శుక్రవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
ఈ దాడుల్లో సుమారు రూ.4 కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించారు. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మునిప్రసాద్‌పై కేసు నమోదు చేసిన ఏసీబీ ఆయన్ను అదుపులోకి తీసుకుంది. కాగా, ఆయన భార్య పేరుతో ఉన్న బ్యాంకు లాకర్‌ను ఇంకా తెరవాల్సి ఉంది.
Comments
Loading comments...

