Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేను గుంపు మేస్త్రీనే : సీఎం రేవంత్‌

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jun 25, 2026 10:11 PM హైదరాబాద్General
నేను గుంపు మేస్త్రీనే : సీఎం రేవంత్‌ - Udayam
ప్రభుత్వానికి వస్తున్న మంచిపేరు ఉద్యోగుల కృషేనని, వారికి ఒకటో తేదీనే జీతాలు ఇవ్వడంతో పాటు పీఆర్సీపై ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రవీంద్రభారతిలో ఉద్యోగుల ఉచిత ప్రమాద బీమా కోసం 14 బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్న కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విపక్షాలకు చురకలంటిస్తూ.. "నన్ను గుంపు మేస్త్రీ అని అవహేళన చేసినా బాధపడను.. ఈ గుంపంతా నాదే. కొందరు మేం దొరలమని, గడీలు ఉన్నాయని గొప్పలు చెప్పుకుంటారు. కానీ నాకు 'రేవంతన్న' అని పిలిపించుకోవడమే ఇష్టం" అని సీఎం అన్నారు.

Comments

G
Loading comments...