Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాస్‌పోర్ట్ ఫీజులు భారీగా పెంపు

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jun 25, 2026 10:14 PM జాతీయంGeneral
పాస్‌పోర్ట్ ఫీజులు భారీగా పెంపు - Udayam
కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్ట్ ఫీజులను భారీగా పెంచింది. 36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్ రుసుమును రూ.1500 నుంచి రూ.2,500కు, తత్కాల్ ఫీజును రూ.3,500 నుంచి రూ.5 వేలకు పెంచింది. 60 పేజీల పాస్‌పోర్ట్‌కు ఇకపై రూ.3,500 (తత్కాల్‌కు రూ.6 వేలు) వసూలు చేయనున్నారు. మైనర్ల ఫీజును రూ.1000 నుంచి రూ.1750కి పెంచగా.. ఈ సవరించిన ధరలు జులై 1 నుంచి అమల్లోకి వస్తాయని విదేశాంగ శాఖ తెలిపింది. ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో దరఖాస్తుకు చెల్లుబాటయ్యే 12 గుర్తింపు కార్డుల్లో పాస్‌పోర్ట్ కూడా ఒకటని ఈసీ స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...