Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారిని వదిలేసి తాళం వేసిన ఆయా

Follow Udayam on Google
SHRUTHI Sep 17, 2026 7:31 AM కరీంనగర్General
అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారిని వదిలేసి తాళం వేసిన ఆయా - Udayam
కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం ఇస్లాంపూర్‌ అంగన్‌వాడీ కేంద్రంలో మూడేళ్ల చిన్నారి అమ్రిన్‌ నిద్రిస్తుండగా గమనించని ఆయా, గదికి తాళం వేసి వెళ్లిపోయారు. దాదాపు నాలుగు గంటలపాటు చిన్నారి గదిలోనే బిక్కుబిక్కుమంటూ ఉండగా, స్థానికులు గుర్తించి రాత్రి 8 గంటలకు తాళం తీసి బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనపై ఐసీడీఎస్‌ సీడీపీవో విచారణ జరిపి, ఆయా లచ్చమ్మతో పాటు ఇన్‌ఛార్జి టీచర్, సూపర్‌వైజర్‌కు మెమోలు జారీ చేశారు.

Comments

G
Loading comments...