వార్తలకు తిరిగి వెళ్లండి

బీబీనగర్ మండలం రామునిగుండ్లతండా గ్రామ పంచాయతీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ బి. గోపీచందు నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
అంగన్వాడీ టీచర్లు హిమబిందు, సునీత, గ్రామ కార్యదర్శి విద్య, పంచాయతీ సిబ్బంది, చిన్నారులు, గ్రామస్థులు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి, పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.
Comments
Loading comments...

