Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాలువ పక్కన అంగన్వాడీ- ఆందోళనలో తల్లిదండ్రులు

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 10:01 AM కర్నూలుGeneral
కాలువ పక్కన అంగన్వాడీ- ఆందోళనలో తల్లిదండ్రులు - Udayam
కర్నూలు జిల్లా గూడూరు మండలం గుడిపాడులో కాలువ పక్కన ఉన్న అంగన్వాడీ భవనం ప్రమాదకరంగా మారిందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో కాలువ పారితే పిల్లల భద్రతకు ముప్పు ఉందని చెబుతున్నారు. కాలువ దాటేందుకు ఇబ్బందిగా ఉందని, పిచ్చి మొక్కలు పెరిగి పరిసరాలు అధ్వానంగా మారాయని తెలిపారు. ICDS, పంచాయతీ అధికారులు స్పందించి భవనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...