Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

3 కోళ్లను మింగిన కొండచిలువ

Follow Udayam on Google
S kumar Aug 18, 2026 10:48 AM పెద్దపల్లితెలంగాణ
పెద్దపల్లి మండలంలోని అందుగులపల్లిలో మంగళవారం కొండచిలువ కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన బొక్కల రవీందర్ ఇంట్లోకి చొరబడిన కొండచిలువ.. అక్కడ ఉన్న 3 కోళ్లను మింగేసింది. కొన్ని రోజులుగా కోళ్లు వరుసగా మాయమవుతుండటంతో ఆందోళనలో ఉన్న రవీందర్, కొండచిలువను చూసి స్థానికులకు సమాచారం అందించారు. దీంతో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని కొండచిలువను సురక్షితంగా తరిమికొట్టారు.

Comments

G
Loading comments...