Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ రాజధానిపై రచ్చ: వైకాపా వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్!

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 03, 2026 6:00 PM అమరావతిGeneral
ఏపీ రాజధానిపై రచ్చ: వైకాపా వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్! - Udayam
రాజధాని అమరావతిపై వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రంగా ఖండించారు. అమరావతి విషయంలో వైకాపా నేతలు పూటకో మాట మాట్లాడుతూ నిమిషానికో విషప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రమంతా అమరావతి తోనే ఉంటుందని, అమరావతే శాశ్వతమని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని నిలబెట్టిన చంద్రబాబును విలన్ అనడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

Comments

G
Loading comments...