వార్తలకు తిరిగి వెళ్లండి

కమాన్‌పూర్ మండలానికి చెందిన నల్లవెల్లి ఆనంది రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల పరుగులో బంగారు పతకం సాధించింది. హనుమకొండ జేఎన్‌ఎం స్టేడియంలో శుక్రవారం జరిగిన పోటీలో 56 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుంది.
ఈ విజయంతో పంజాబ్‌లో జరగనున్న 21వ జాతీయ యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌కు ఆనంది ఎంపికైంది. ప్రస్తుతం కమాన్‌పూర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
Comments
Loading comments...

