వార్తలకు తిరిగి వెళ్లండి

కుభీర్ మండలం సిరిపెల్లి గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త కాంతాబాయి(41) అనారోగ్యంతో సోమవారం ఉదయం మృతి చెందారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నా, పేదరికం వల్ల విధులను నిర్వర్తిస్తూనే ప్రజలకు సేవలందించారు.
ఇటీవల ఆరోగ్యం క్షీణించడంతో నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొంది, కోలుకోలేక స్వగ్రామంలో కన్నుమూశారు. పీహెచ్‌సీ వైద్యులు విజేష్, ఆశా కార్యకర్తలు, ఆసుపత్రి సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

