వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి జిల్లాలో అమృత్ 2.0 కింద రూ.515 కోట్లతో చేపట్టిన తాగునీటి పనులు 20 శాతం కూడా పూర్తికాలేదు. ట్యాంకులు, పైపులైన్లు, కుళాయి కనెక్షన్ల పనులు నెమ్మదిగా సాగుతున్నాయి.
నిజామాబాద్‌లో 16 ట్యాంకులు నిర్మించాల్సి ఉండగా కొన్ని చోట్ల పునాది పనులకే పరిమితమయ్యాయి. 12 వేల కుళాయి కనెక్షన్లకు 500 మాత్రమే ఇచ్చారు. పనుల గడువును డిసెంబరు 31 వరకు పొడిగించారు.
Comments
Loading comments...

