Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతిలో రాజ్ భవన్ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 31, 2026 8:49 PM గుంటూరుGeneral
అమరావతిలో రాజ్ భవన్ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ - Udayam
రాజధాని అమరావతిలో గవర్నర్ నివాస సముదాయం నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. రాజ్‌భవన్, దర్బార్ హాల్‌తో పాటు ఇతర నిర్మాణాల కోసం రూ.212.22 కోట్లతో గతంలో జారీ చేసిన పరిపాలనా అనుమతులకు ఆర్థిక శాఖ తాజాగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ సోమవారం జీవో-1100 విడుదల చేశారు.

Comments

G
Loading comments...