Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో రోడ్డు ప్రమాదం. నిజామాబాద్ వాసి మృతి

Follow Udayam on Google
raju Aug 26, 2026 3:46 PM నిజామాబాద్General
అమెరికాలో రోడ్డు ప్రమాదం. నిజామాబాద్ వాసి మృతి - Udayam
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ నగరానికి చెందిన యువకుడు మృతి చెందాడు. ఫ్లోరిడాలో జరిగిన యాక్సిడెంట్లో తెలంగాణకు చెందిన ముగ్గురు మరణించగా.. వీరిలో నిజామాబాద్ లోని గూపనపల్లికి చెందిన రాహుల్ ఉన్నాడు. ఈ యువకుడు మూడు నెలల క్రితం ఎంఎస్ చేయడానికి అమెరికాకు వెళ్లాడు. ఇంతలోనే మృత్యువు అతడిని కబళించింది. రాహుల్ మృతితో తల్లిదండ్రులు హరిబాబు, నాగమణి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Comments

G
Loading comments...