Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గృహనిర్మాణ సిమెంటు మళ్లింపుపై ఆరోపణలు

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 30, 2026 3:04 PM పార్వతీపురం మన్యంGeneral
గృహనిర్మాణ సిమెంటు మళ్లింపుపై ఆరోపణలు - Udayam
పాలకొండ నగర పంచాయతీ పరిధిలో గృహనిర్మాణ లబ్ధిదారులకు అందాల్సిన సుమారు 560 సిమెంటు బస్తాలు పక్కదారి పట్టించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లాగిన్ పాస్‌వర్డ్‌లు మార్చి సిమెంటు విడుదల చేశారని సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఎమినిటీస్ కార్యదర్శులకు తెలియకుండా సిమెంటు విడుదలైనట్లు గుర్తించి అధికారులు, గృహనిర్మాణ శాఖకు ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...