Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వార్డు ఆఫీసర్లపై వసూళ్ల ఆరోపణలు

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 04, 2026 10:48 AM ఖమ్మంGeneral
వార్డు ఆఫీసర్లపై వసూళ్ల ఆరోపణలు - Udayam
ఖమ్మం నగరపాలక సంస్థలో కొందరు వార్డు ఆఫీసర్లు లబ్ధిదారుల నుంచి డబ్బు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్పింగ్ కమిషనర్‌కు చేరడంతో విచారణకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు, ఇంటి నంబర్ల కేటాయింపులో వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. విచారణ నివేదిక ఆధారంగా సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

Comments

G
Loading comments...