వార్తలకు తిరిగి వెళ్లండి

అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, సాగర్ అదానీపై ఉన్న క్రిమినల్ కేసులను అమెరికా న్యాయ విభాగం ఉపసంహరించుకుంది. ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని ప్రాసిక్యూటర్లు నిర్థారించడంతో న్యూయార్క్‌లో ఉన్న సెక్యూరిటీస్, వైర్ ఫ్రాడ్ కేసు పూర్తిగా ముగిసింది.
మరోవైపు, ఇరాన్ ఎల్‌పీజీ దిగుమతుల ఆంక్షల ఉల్లంఘన కేసును పరిష్కరించుకునేందుకు 275 మిలియన్ డాలర్లు (రూ.2600 కోట్లకు పైగా) చెల్లించేందుకు అదానీ ఎంటర్‌ప్రైజెస్ అంగీకరించింది. అయితే, దీనిని నేర నిర్థరణగా పరిగణించరాదని కంపెనీ స్పష్టం చేసింది.
Comments
Loading comments...

