వార్తలకు తిరిగి వెళ్లండి

వాజేడు మండలంలో అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు కొర్సా నరసింహమూర్తి ఎంపీడీవో కృపాకర్‌ను కోరారు. వాజేడు, మండపాక, చెరుకూరు గ్రామాల్లో నిర్మాణాలపై బుధవారం వినతిపత్రం అందజేశారు.
పెసా గ్రామసభల నిర్వహణపై పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు విద్యాసాగర్ తదితరులున్నారు.
Comments
Loading comments...

