Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎయిరిండియా పైలట్‌ డ్రగ్‌ టెస్ట్‌లో విఫలం

Follow Udayam on Google
రచన దేవి Aug 11, 2026 8:43 PM జాతీయంGeneral
ఎయిరిండియా పైలట్‌ డ్రగ్‌ టెస్ట్‌లో విఫలం - Udayam
ఆగస్టు 4న తీవ్ర కుదుపులకు గురైన ఎయిరిండియా విమాన పైలట్‌ డ్రగ్‌ టెస్టులో విఫలమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పైలట్‌ గంజాయి సేవించినట్లు పరీక్షలో తేలిందని పేర్కొన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. థాయ్‌లాండ్‌ నుంచి దిల్లీకి వస్తున్న విమానంలో 145 మంది ఉండగా, 17 మంది గాయపడ్డారు. ఘటనపై విచారణ నేపథ్యంలో ఇద్దరు పైలట్లను డీజీసీఏ రోస్టర్‌ నుంచి తప్పించారు.

Comments

G
Loading comments...