Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేయూత పింఛన్ల దరఖాస్తులకు ఈ నెల 31 గడువు

Follow Udayam on Google
Harika Aug 22, 2026 11:55 AM మెదక్General
చేయూత పింఛన్ల దరఖాస్తులకు ఈ నెల 31 గడువు - Udayam
నూతన చేయూత పింఛన్లకు అర్హులైన వారు ఈ నెల 31లోగా మండల, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలని మెదక్‌ కలెక్టర్‌ ప్రతిమా సింగ్‌ తెలిపారు. దరఖాస్తులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌లో సహాయ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. సహాయం కోసం 8008556112 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. దివ్యాంగుల యూడీఐడీ కోసం ఆగస్టు 26న మెదక్‌ జీజీహెచ్‌లో ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...