వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగళూరులో ఏఐ ఆధారిత ట్రాఫిక్ కెమెరా చేసిన ఓ పొరపాటు స్థానికంగా చర్చనీయాంశమైంది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి వీపునకు ఉన్న గిటార్ బ్యాగ్‌ను వెనుక కూర్చున్న వ్యక్తిగా పొరబడి హెల్మెట్ లేదంటూ పోలీసులు రూ.500 జరిమానా విధించారు.
ఫొటోను నిశితంగా పరిశీలించి వెనుక ఎవరూ లేరని గ్రహించిన బాధితుడు అధికారులను సంప్రదించగా, సాంకేతిక లోపంపై సంబంధిత విభాగానికి ఫిర్యాదు చేయాలని సూచించారు.
Comments
Loading comments...

