వార్తలకు తిరిగి వెళ్లండి

అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు శుక్రవారం ప్రహ్లాద స్వామి, శ్రీదేవి, భూదేవి, అమృతవల్లి అమ్మవారికి విశేష తిరుమంజనం నిర్వహించారు.
ప్రధానార్చకులు వేణుగోపాలాచార్యులు, అర్చక బృందం ఆధ్వర్యంలో తిరుమంజనం జరిగింది. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి నవరాత్రి పూజలు నిర్వహించారు.
Comments
Loading comments...

