వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
గాంధీజీ చూపిన శాంతి, సత్యం, అహింసా మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు. స్వాతంత్ర్యం కోసం గాంధీజీ చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే ఘన నివాళి అని ఎస్పీ పేర్కొన్నారు.
Comments
Loading comments...

