Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా

Follow Udayam on Google
babu varun Aug 10, 2026 9:27 AM రాజన్న సిరిసిల్లక్రైమ్
అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా - Udayam
అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన ముస్తాబాద్ మండలం మొర్రపూర్ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన భూక్య మోహన్ నాయక్ సోమవారం ఉదయం దున్నేందుకు ట్రాక్టర్ పై వెళ్తుండగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పొలంలో పడిపోయింది. మోహన్ నాయక్ అప్రమత్తమై దూకడంతో ప్రాణాపాయం తప్పింది. హుటా హుటిన స్థానికులు అక్కడ చేరుకొని పరిస్థితులను పరిశీలించారు.

Comments

G
Loading comments...