Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అదుపుతప్పి ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు

Follow Udayam on Google
B RAJESH Sep 08, 2026 7:33 PM విజయనగరంGeneral
అదుపుతప్పి ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు - Udayam
గంట్యాడ మండలం కొత్త వెలగాడ గ్రామ జంక్షన్ సమీపంలో గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 8మందికి గాయాలయ్యాయి. గజపతినగరం, మెంటాడ మండలాలకు చెందిన కొందరు ఆటోలో ఎస్.కోట మండలం బొడ్డవర గ్రామానికి వెళ్తుండగా కొత్త వెలగాడ గ్రామ జంక్షన్ సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. క్షతగాత్రులను 108 వాహనంలో గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.

Comments

G
Loading comments...