వార్తలకు తిరిగి వెళ్లండి

దిలావర్పూర్ గ్రామంలో అడవి పందుల బెడద రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.
యువరైతు పురుషోత్తం రెండు ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్నలో ఎకరం పంటను అర్ధరాత్రి అడవి పందులు పూర్తిగా ధ్వంసం చేశాయి. ఇప్పటికే వాతావరణ ప్రతికూలతలతో ఇబ్బందులు పడుతున్న తనకు పంట నష్టం మరింత భారంగా మారిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలను కాపాడేందుకు ప్రభుత్వం శాశ్వత చర్యలు చేపట్టాలని కోరారు.
Comments
Loading comments...

