వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో ఉన్న గాంధీనగర్ కు చెందిన నారపాక అశోక్ అడవి పంది దాడిలో గాయపడ్డారు. అశోక్ శనివారం ఉదయం మంచిర్యాల నుండి జన్నారం వస్తున్న క్రమంలో స్థానిక ఆశన్న గుడి వద్ద మూత్ర విసర్జన కోసం ఆగారు.
ఆ సమయంలో వెనుక నుండి అడవి పంది దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అశోక్ ను సానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

